FbTelugu

మిస్ ఫైర్ కాదు… కావాలనే చంపాడు!

విజయవాడ: బెజవాడ గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్టు చోటు చేసుకున్నది. ప్రాథమిక విచారణ తరువాత భార్యను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.
సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సెక్యురిటీ విభాగం ఏఎస్పీ శశిభూషణ్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న హోమ్ గార్డు వినోద్.. గన్ మిస్ ఫైర్ కావడంతో తన భార్య రత్నప్రభ చనిపోయిందని తెలిపారు.

ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి గొల్లపూడి మౌలా నగర్ లో చోటు చేసుకున్నది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోతుగా విచారించి, హోమ్ గార్డు ను అదుపులోకి తీసుకున్నారు. రత్నప్రభ మృతిపై భిన్న కథనాలను రావడంతో హోమ్ గార్డును కాస్త రెట్టించి అడగడంతో అసలు విషయం బయట పెట్టాడు. మిస్ ఫైర్ లో చనిపోలేదని, తానే కావాలని చంపినట్లు నిజాన్ని ఒప్పుకున్నాడు. బంగారం తాకట్టు విషయంలో తనకు, భార్యకు మధ్య కొద్దిరోజులుగా గలాట జరుగుతున్నదని, ఆవేశంలో ఆమెను మట్టుబెట్టినట్లు నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం రత్నప్రభ నాలుగు నెలల గర్భిణి గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.