FbTelugu

పరీక్షల్లో రెండుసార్లు నెగటీవ్.. వైరస్ తోనే మృతి!

ఢిల్లీ: కరోనా పరీక్షల్లో రెండు సార్లు కరోనా నెగటీవ్ వచ్చినప్పటికీ అదే కరోనాతో ఓ డాక్టర్ మృతి చెందిన ఘటన దేశ రాజధానిలో ఢిల్లీలో చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. అభిషేక్ అనే డాక్టర్ మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైన్సెస్(మెయిడ్స్)లోని ఓరల్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్నాడు.

కాగా అభిషేక్ గత నెలలో హరియాణా వెళ్లి వచ్చారు. రెండు సార్లు కరోనా టెస్టులు చేసుకోగా నెగటీవ్ వచ్చింది. కానీ తాజాగా శ్వాస తీసుకోలేకపోతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. డాక్టర్ చనిపోవడానికి ముందు తనలో కనిపిస్తున్నవి కరోనా లక్షణాలేనని తనతో చెప్పాడని.. అభిషేక్ సోదరుడు తెలిపారు. కాగా అభిషేక్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని మెయిడ్స్ సీనియర్ డాక్టరు ఒకరు స్పష్టం చేశారు.

You might also like