FbTelugu

పెను విషాదం… 22 మంది మృతి

ముంబయి: నాసిక్ లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ హాస్పిటల్ లో ఆక్సిజన్ లీకైన ఘటనలో 22 మంది రోగులు ప్రాణాలు వదిలారు. ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లలోకి నింపుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నది.

కరోనాతో పోరాడుతున్న రోగులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కు చేరుకున్న ట్యాంకర్ నుంచి సిలిండర్లకు ఆక్సిజన్ నింపేందుకు సమాయత్తమయ్యారు. నింపే క్రమంలో లీక్ కావడంతో అర గంట పాటు కరోనా పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ నిలిచిపోయింది. వెంటిలేటర్లపై ఉన్న రోగులకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరుగుతూ ఉండాలి. ఈ హాస్పిటల్ లో సుమారు 150 మంది రోగులు ఆక్సిజన్ పై ఆధారాపడి ఉన్నారు. వీరిలో 22 మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. ఈ ఘటన చాలా బాధాకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.