FbTelugu

టిక్ టాక్ కు మరో గండం

లండన్: టిక్ టాక్ కు ఒకటి తరువాత మరొకటి సమస్య చుట్టుముడుతోంది. తాజాగా పన్నెండేళ్ల చిన్నారి బ్రిటన్ లో టిక్ టాక్ పై కేసు వేసింది. ఈ కేసును కోర్టు స్వీకరించి విచారించింది.

టిక్ టాక్ 2020 సంవత్సరం చేదు అనుభవాలనే ఎదుర్కొన్నది. ఐరోపా దేశాలు సహా పలు దేశాలు ఈ యాప్ ను నిషేధించాయి. ఇప్పుడిప్పుడే సమస్యల సుడిగుండం నుంచి బయటకు వస్తున్న తరుణంలో మరో పిడుగు పడింది. తన వివరాలు గోప్యంగా పెట్టి, కేసు ఫైల్ చేసేందుకు బ్రిటన్ లో స్థానిక కోర్టు అనుమతించింది. వ్యక్తిగత గోప్యత విషయంలో ఐరోపా సమాఖ్య నిబంధనలు టిక్ టాక్ ఉల్లంఘించిందని ఆ చిన్నారి ఆరోపించింది.

ఈ యాప్ మూలంగా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయని కోర్టుకు విన్నవించింది. బాలిక వాదనలో చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఏకీభవించిన కోర్టు విచారణకు ఆదేశించింది. టిక్ టాక్ వినియోగించే వారిలో పిల్లలు కూడా ఉన్నందున వారి హక్కుల కోసం దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.