FbTelugu

రేటు తగ్గించుకున్న టీవీ యాంకర్లు

కరోనా విలయం అన్ని రంగాలను దివాళా తీయించింది. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. నిన్నటి వరకు వేలల్లో రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు యాంకర్లు అమాంతం తగ్గించుకోక తప్పలేదు.

తెలుగు బుల్లి తెరపై సుమ కనకాల, అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, శ్రీముఖి, ఝాన్సీ, మంజూష లతో మరికొందరు కొద్ది రోజులుగా షూటింగ్ లకు వెళ్తున్నారు. ఎపిసోడ్, నిర్మాణ సంస్థను బట్టి యాంకర్లు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకునేవారు. కరోనా వచ్చిన తరువాత పరిస్థితులు తల్లకిందులు అయ్యాయి. గతంలో తీసుకున్న మొత్తం లో సగం తగ్గించుకున్నారు.
కొందరైతే నామమాత్రం డబ్బులు చెల్లించినా షూటింగ్ లకు వెళ్తున్నారు. ఇంటికే పరిమితం అయితే జనాలు మరిచిపోతారనే ఉద్దేశంతో షూటింగ్ లకు ఓకే చెబుతున్నారు. అదే విధంగా జబర్దస్త్ షో లో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునే వీళ్లు సగానికి పైగా తగ్గించినట్లు సమాచారం. ఆఫర్లు లేని వాళ్లు స్వంతంగా యూ ట్యూబ్ ఛానళ్లలో వీడియోలను అప్ లోడ్ చేసుకుంటున్నారు. ఇదీ యాంకరమ్మల పరిస్థితి.

You might also like