FbTelugu

టీవీ నటి చిత్ర ఆత్మహత్య

చెన్నై : ప్రముఖ టీవీ నటి విజె.చిత్ర ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ నటి విజె.చిత్ర(28) ఇవాళ ఉదయం చెన్నైలోని ఓ హోటల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చిత్రకు ఇటీవలే హేమంత్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థమైంది. చిత్ర ‘పాండియన్ స్టోర్స్’ అనే టీవీ సిరీస్ లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు. పలు సినిమాల్లోనూ నటించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.