FbTelugu

ఉపాధి లేక టీవీ నటుడి ఉరి

ఢిల్లీ: ఒకవైపు లాక్ డౌన్, మరోవైపు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో టీవీ నటుడు మన్ మిత్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటి అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో మనస్తాపానికి గురైన మన్ మిత్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. బయట నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన ఆయన తన బెడ్ రూమ్ లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఇంట్లో ఏదో శబ్ధం రావడంతో భార్య వంట గది నుంచి బయటకు వచ్చింది. బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా ఉరి వేసుకున్న భర్త కన్పించాడు. ఆ దృశ్యం చూసిన ఆమె అరిచింది. అపార్ట్ మెంటులో ఇరుగు పొరుగు వారు ఎవరూ రాలేదు. సెక్యూరిటీ గార్డులు వచ్చి, మన్ మిత్ ను కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందారని వైద్యులు ధృవీకరించి, పోస్టుమార్టం కోసం తరలించారు.

You might also like