FbTelugu

జర్నలిస్టులు సూపర్ స్ప్రెడర్లు కాదు: టియుడబ్ల్యుజె

హైదరాబాద్: జర్నలిస్టులు సూపర్ స్ప్రెడర్లు కాదని ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సమాచారం ఇస్తున్నారని టియుడబ్ల్యుజె అధ్యక్ష్లులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ అన్నారు.
కెసిఆర్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులను సూపర్ స్ప్రెడర్లుగా ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టుల ను ఫ్రంట్ లైన్ వారియర్లు గా గుర్తించి కరోనా తో మరణించిన వారందరికి అధికారికంగా సంతాపం ప్రకటించాలన్నారు. వారి కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేకంగా బీమా పథకం అమలు చేయాలని అన్నారు. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారికి, పొందిన వారికి అయిన ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలన్నారు. గ్రామీణ జరలిస్టులకు గడచిన 15 నెలల కరోనా కాలానికి నెలకు రూ.5వేల చొప్పున కరోనా భృతి చెల్లించాలి. ఇవేమీ చేయడానికి ఆలోచన చేయకుండా జర్నలిస్టుల ను సూపర్ స్ప్రేడర్లు గా ప్రకటించడం అవమానించడమేనన్నారు. సూపర్ స్ప్రెడర్లు కాదు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న అత్యధిక రిస్క్ లో ఉన్న వారన్నారని తెలిపారు. మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అనే భావన ఉంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలని టియుడబ్ల్యుజె డిమాండ్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.