FbTelugu

ట్విటర్ కు షాకిచ్చిన టర్కీ

సోషల్ మీడియా భూతాలపై ప్రపంచ దేశాల్లో చలనం మొదలైంది. అడ్డగోలుగా సాగుతున్న విషపు ప్రచారాలను కట్టడి చేయడంలో విఫలమవుతున్న ఈ సంస్థలపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.
తాజాగా టర్కీ దేశం ట్విటర్ కు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ట్విటర్ కు ఎలాంటి ప్రకటనలు ఇవ్వవద్దని నిషేధం విధించింది. సోషల్ మీడియా సంస్థలను నియంత్రించేందుకు ఇటీవల టర్కీ దేశం కొత్తం చట్టం తీసుకువచ్చింది. ఈ

సంస్థలన్నీ టర్కీ దేశస్థుడైన ఒకరిని తమ ప్రతినిధిగా నియమించుకోవాలి. విషపు ప్రచారాలను సదరు ప్రతినిధి గమనించడంతో పాటు వెంటవెంటనే తొలగించాలి. ఈ నిబంధనలను ట్విటర్ బేఖాతర్ చేసింది. ఇంకేముందు టర్కీ ప్రభుత్వం ట్విటర్ పై వేటు వేసింది.
ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటికే యూ ట్యూబ్, పేస్ బుక్ లు భారీ జరిమానాలు చెల్లించుకుని లెంపలేసుకున్నాయి. ఇలాగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.