FbTelugu

జలకళ సంతరించుకున్న తుంగభద్ర

కర్నూలు: తుంగభద్ర ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు నీరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వచ్చి చేరుతోంది.

తుంగభద్ర ప్రాజెక్టులోకి 3,522 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలుపుతున్నారు. కాగా 285 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

You might also like