FbTelugu

దిగొచ్చిన టీటీడీ

తిరుమల: ప్రజలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో టీటీడీ పాలక మండలి దిగి వచ్చింది. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. ఈ భూముల్లో దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి ప్రభుత్వం కోరింది.

ఈ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది. గత రెండు రోజులుగా టీటీడీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, భక్తులు అందచేసిన ఆస్తులను విక్రయించడం ఎంత వరకు సబబు అనే దానిపై పలువురు విమర్శించారు. విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద ఆదేశం మేరకు జరుగుతున్నాయని పలువురు విమర్శించారు కూడా. మొత్తానికి ప్రభుత్వం స్పందించడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

You might also like