FbTelugu

టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్ల కోటా నేడు విడుదల

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300) కోటాను ఇవాళ (జూన్ 29 సోమవారం) టీటీడీ ఆన్లైన్ లో విడుద‌ల చేయనుంది. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అదేవిధంగా, జూలై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయనున్నారు. కాగా తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లు పొంద‌వ‌చ్చని తెలిపింది.

జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారని తెలిపింది. జూలైలో శ్రీ‌వారి ఆల‌యంలో ప‌ర్వ‌దినాలు జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, జూలై 16న ఆణివ‌ర ఆస్థానం, జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర‌, తిరుమ‌ల శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు, జూలై 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి, జూలై 30 నుండి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు జరగనున్నట్టు తెలిపింది.

You might also like