విజయవాడ: తక్షణమే తమిళనాడు, రిషికేష్ లోని టీటీడీ ఆస్తుల వేలాన్ని ఆపాలని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.
యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుండగా హడావిడిగా టీటీడీ ఆస్తులను విక్రయించటం సరైంది కాదన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా టీటీడీ బోర్డు వైఖరి ఉందని విమర్శించారు.
మీరు, మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అమ్మేందుకు సిద్ధమైనట్లుగా ఉన్నదన్నారు. దాతల ద్వారా టీటీడీకి సమకూరిన ఆస్తులను వేలం వేయడం తగదని సూచించారు. ఇంత అత్యవసరంగా ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అని రామకృష్ణ అడిగారు.