FbTelugu

సర్వదర్శనం టోకెన్ల కు బ్రేక్: టిటిడి

తిరుమ‌ల‌: దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సర్వదర్శనం టైం స్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

అనగా ఆదివారం (11-4-2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారని ప్రకటించింది. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టిటిడి తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.