FbTelugu

టీటీడీ ప్రధాన అర్చకులు సంచలన ట్వీట్

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరో మారు సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలను ట్విట్టర్ లో వెల్లడించారు.  వంశపర్యంపర్య అర్చకులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో చంద్రబాబు నాయుడు పాలసీని అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా నిర్ధారణ అయిందని, 25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందన్నారు.

తన ట్వీట్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్యాగ్ చేశాడు.

You might also like