FbTelugu

ఉద్యోగుల భద్రతపై కమిటీ వేశాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: టీటీడీ ఉద్యోగుల భద్రతపై చర్చించేందుకు ఓ కమిటీని వేసినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ s ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మట్లాడుతూ.. ఇప్పటివరకు 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా వచ్చిందని తెలిపారు.

ఈ నెల చివరి వరకూ భక్తుల సంఖ్యను పెంచబోమని తెలిపారు. కరోనా సమయంలో దర్శనం కల్పించడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్యను పెంచామని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. వచ్చే పాలకమండలి సమావేశాన్ని ఎస్వీబీసీ ఛానెల్ లో లైవ్ టెలీకాస్ట్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

You might also like