FbTelugu

నేడు కరోనా తీవ్రతపై టీటీడీ బోర్డు భేటీ

తిరుమల: తిరుమల కొండపై పదిమంది టిటిడి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏమి చేయలనే దానిపై టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం అవుతోంది.
నేడు ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ లో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం ప్రారంభం కానున్నది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. భక్తుల సంఖ్య ను కుదించడమా లేక మరింత పెంచడమా అనే అంశాల పై నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా టీటీడీ ఆస్తుల పై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

టీటీడీ ఆస్తులు, భూములు, నగలు ఎన్ని ఉన్నాయనే పూర్తి వివరాలను ఇకపై భక్తులందరి కోసం వెబ్ సైట్ లో పొందుపర్చనున్నారు. కొండపై ఉన్న అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సమావేశానికి హాజరుకానున్నారు. బోర్డు సభ్యులు ఇంటి నుంచే సమావేశానికి హాజరుకానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.