FbTelugu

థామస్ సేవ పై టిటిడి ఆగ్రహం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) వెబ్ సైట్ లోని తోమాల సేవను కొందరు వ్యక్తులు థామస్ సేవగా మార్చి దుష్ప్రచారం చేస్తున్నారని టిటిడి మండిపడింది.
కొందరు ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఇలాంటి కుట్రలను టిటిడి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తోమాల సేవను థామస్ సేవగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టిటిడి స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.