FbTelugu

టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం

మేడ్చల్: సకాలంలో జీతాలు చెల్లించాలని ఆందోళన చేసినందుకు డిపో మేనేజర్ సరిగా డ్యూటీలు వేయకుండా వేధిస్తున్నందుకు మనస్థాపానికి గురైన ఒక కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన మేడ్చల్ డిపో అవరణలో చోటు చేసుకున్నది. సహచర ఉద్యోగులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. శామీర్ పేట మండలం అలియాద్ గ్రామానికి చెందిన అశోక్ 14 సంవత్సరాలుగా మేడ్చల్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ప్రతి నెలా 5వ తేదీ లోగా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఆ ప్రకారంగా జీతాలు ఇవ్వడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలంటూ ఈ నెల 16న అశోక్ మేడ్చల్ డిపో ముందు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించాడు.

అప్పటి నుంచి డిపో మేనేజర్ మాధవి, సీఐ స్వాతి, టీఐ2 నర్సింహులు గ్రూపుగా ఏర్పడి అశోక్ కు డ్యూటీలు వేయడం లేదు. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్ శనివారం ఉదయం డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, తోటి కార్మికులు అతని వద్ద నుంచి అగ్గిపెట్టే లాక్కున్నారు. కార్మికులు అశోక్ కు నచ్చచెప్పి ఇంటి వద్ద దించి వచ్చారు. డిపో మేనేజర్, సీఐ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సహచర కార్మికులు ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.