FbTelugu

కరోనా పేరుతో తల్లిని వదిలించుకునే ప్రయత్నం…

కరీంనగర్: మాయదారి కరోనా కాలం అంటే ఇదేనేమో. కరోనా వైరస్ పేరుతో తల్లినే వదిలించుకోవాలని పుత్రరత్నం చూడగా, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తల్లిని పెద్ద కుమారుడి వద్దే ఉండేలా చూశారు.

వృద్దురాలు శ్యామల ఇటీవలే మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లింది. లాక్ డౌన్ సడలించడంతో ఆమె అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ లోని తన కుమారుల వద్దకు వచ్చింది. కరోనా పేరు చెప్పి ఆమెను లోనికి రానివ్వకుండా బయటే ఎండలో నిల్చోబెట్టారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఇంటి ముందు చేరుకుని కుమారులను నిలదీశారు.

అయినా కుమారులు ఏమాత్రం తగ్గకుండా ఆమెకు కరోనా ఉందంటూ బుకాయించారు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ అశోక్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కరోనా ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు, క్వారంటైన్ పంపించే వాళ్లు అంటూ కుమారులకు సర్ధిచెప్పాడు. దీంతో పెద్ద కుమారుడు తల్లి శ్యామలను ఇంట్లోకి తీసుకువెళ్లాడు.

You might also like