FbTelugu

ఫేస్ బుక్, ట్విటర్ ను ఏకి పారేసిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి దిగిపోయినా ఏమాత్రం దూకుడు తగ్గించడం లేదు. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నారు.

ట్విటర్ ను నిషేధిస్తూ నైజీరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గొప్ప నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ప్రపంచ దేశాలను ట్విటర్ ను నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఫేస్ బుక్, ట్విటర్ లు వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. నియంతలు మంచి, చెడులను నిర్ణయించడం ఏంటని ఆయన మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ రెండు సోషల్ మీడియాలను నిషేధించాల్సి ఉండాల్సిందని, తప్పు చేశానని ఆయన పశ్చాత్తాప పడ్డారు. ఫేస్ బుక్ యజమాని జూకర్ బర్గ్ నన్ను కలిసి ఒకసారి వైట్ హౌస్ కు విందుకు వస్తానని అన్నారు. బహుషా 2024కు వర్తిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.