FbTelugu

చైనాపై కత్తులు నూరుతున్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చైనా దేశంపై ఆగ్రహం చల్లారలేదు. భవిష్యత్తులో చైనాతో వ్యాపారం చేయలని అనుకోవడం లేదని, సరైన భాగస్వామిగా అనుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని ఆయన అన్నారు. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై భారీ పన్నులు పెంచడంతో చైనా ప్రభుత్వం ధీటుగా స్పందించింది. దీంతో జనవరి నెల నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది.

You might also like