FbTelugu

జూకర్ బర్గ్ ను కిందకి లాగిన ట్రంప్

కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతూ డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ సిఈఓ మార్క్ జూకర్ బర్గ్ ను కిందకు లాగి పోయారు. వరల్డ్ టాప్ సిఈఓ లిస్టులో బర్గ్ చోటు సంపాదించుకోలేకపోయారు.
ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు సిఈఓల పనితీరుపై ఆ సంస్థలకే చెందిన ఉద్యోగుల నుంచి అభిప్రాయం సేకరించడం గ్లాస్ డోర్ సంస్థ పని. అలా సేకరంచిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం వంద మంది సిఈఓల జాబితాను తయారు చేసి విడుదల చేస్తుంది. 2013 నుంచి ఈ జాబితాలో మార్క్ జూకర్ బర్గ్ కు స్థానం లభిస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం చోటు దక్కకపోవడం ఫేస్ బుక్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గ్లాస్ డోర్ జాబితాలో మైక్రో సాఫ్ట్ అధినేత నాదేళ్ల సత్య 97 శాతం, ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ 95 శాతం సాధించగా బర్గ్ మాత్రం 88 శాతానికే పరిమితం అయ్యారు.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు, క్యాపిటల్ బిల్డింగ్ పై రిపబ్లికన్ల దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ గొడవతో ఫేస్ బుక్ ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నది. ఇలాంటి వాటిని నిలువరించడంలో మెతక వైఖరి అవలంభించారనే విమర్శలు ఉన్నాయి. కరోనా సమయంలో కూడా మొత్తం తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారం ఫేస్ బుక్ లో విశ్వవ్యాప్తమయ్యాయి. వీటిని నిరోధించడంలో తాము విఫలమయ్యామని ఫేస్ బుక్ ఉద్యోగులే ఒప్పుకోవడం విశేషం.
ఫేస్ బుక్ కు ప్రపంచ వ్యాప్తంగా 60వేల మంది ఉద్యోగులు ఉండగా అందులో వివిధ స్థాయిల్లోని 700 మంది ఉద్యోగుల అభిప్రాయాన్ని గ్లాస్ డోర్ సంస్థ సేకరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.