FbTelugu

ట్విట్టర్ పై నిప్పులు చెరిగిన ట్రంప్

వాషింగ్టన్: ట్విట్టర్ పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ట్విట్టర్ తాజాగా ట్రంప్ ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ అవసరమని చెప్పడంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని అన్నారు.

తాను అసత్యవార్తలు ప్రసారం చేసే సంస్థలతో తన ట్వీట్లను నిజనిర్ధారణ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ట్రంప్ ట్విట్టర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ పోస్టు చేశాడు. ఈ పోస్టుకు ట్విట్టర్ నీలిరంగు ఆశ్చర్యార్థక చిహ్నాన్ని జోడించింది. దీనర్ధం ఈ పోస్టును నిజనిర్థారణ చేసుకోమని. ఇలా చేయడం పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.