FbTelugu

మరోసారి డబ్ల్యూహెచ్ఓ పై విరుచుకుపడిన ట్రంప్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డబ్ల్యూహెచ్ఓపై విరుచుకుపడ్డారు. డబ్ల్యూహెచ్ఓ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు

నిరూపించుకోవాలని ఏకంగా బహిరంగ లేఖ రాశారు. స్వతంత్రతను నిరూపించుకోకపోతే నిధులను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. తమ సభ్యత్వంపై కూడా పున:పరిశీలిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ డబ్ల్యూహెచ్ఓ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తివిషయంలో తమను హెచ్చరించలేదని, చైనాకు ఈ సంస్థ వత్తాసు పలుకుతోందని మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు.

You might also like