FbTelugu

న్యూయార్క్ నగరం వీడనున్న ట్రంప్

Trump-is-about-to-leave-New-York-City

వాషింగ్టన్: సొంత నగరం న్యూయార్క్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడాకు వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. న్యూయార్క్‌ నగరం, రాష్ట్ర రాజకీయ నాయకులు తన పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. న్యూయార్క్ ను వదిలేసి, ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌కు తన మకాం మారుస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రానికి తాను కొన్ని లక్షల డాలర్లు పన్నుల రూపంలో కడుతున్నట్టు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తన పట్ల చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. మరికొందరైతే అతి నీచంగా చూస్తున్నారు. అందుకే నగరం వదిలి వెళ్లిపోతున్నట్టు తెలిపారు. తాను, తన కుటుంబ సభ్యులు ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోనున్నట్టు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

You might also like