వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి జోసెఫ్ ఆర్.బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మైక్ కెల్లీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మెయిల్ ఓట్లకు రాజ్యాంగ బద్దత లేదని, బైడెన్ కు మెయిల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు విచారించాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేసింది. 2016 ఎన్నికల్లో ట్రంప్ కూడా మెయిల్ ఓట్ల ద్వారానే విజయం సాధించారు. అప్పుడు చెల్లిన ఓట్లు బైడెన్ విషయంలో ఎలా చెల్లకుండా పోతాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
పెన్సిల్వేనియా నుంచి బైడెన్ 80వేల ఓట్ల మెజారిటీతో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్నారు. ఈ విజయాన్ని నిర్ణయించడం కోసం డిసెంబర్ 14వ తేదీన రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజీకి చందిన 20 మంది ఎలక్టర్లు సమావేశమవుతున్నారు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 9 మంది ఉండగా వారిలో ట్రంప్ నియమించిన వారు ఆరుగురు ఉన్నారు. ఆ ఆరుగురు తనకు అనుకూలంగా తీర్పు చెబుతారనే గంపెడాశతో ట్రంప్ ఉన్నారు.