FbTelugu

ట్రంప్ శాంతి మంత్రం

వాషింగ్టన్: చేతులు క లాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. చేసిందంతా చేసి, అంతా అయిపోయాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతిమంత్రం వల్లిస్తున్నారు.

అమెరికా చట్ట సభల సమావేశం భవనం క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని అతిక్రమించి హింసకు పాల్పడేవారు ఈ దేశ ప్రజలు కారంటూ మండిపడ్డారు. క్యాపిటల్ బిల్డింగ్ దాడి ఘటనలో విమర్శలు రావడంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. శాంతి ప్రవచనాలు వల్లిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. జో బైడెన్ గెలుపును యూఎస్ కాంగ్రెస్ ధృవీకరించిందని, సామరస్యపూర్వకంగా అధికార మార్పిడి చేయడంపై దృష్టి సారించానన్నారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆయన వెల్లడించారు.

దేశంల ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించానని, ఎన్నికల చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తన ఓటమి గురించి ఎవరూ బాధపడవద్దని, మన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ట్రంప్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.