FbTelugu

ట్రంప్ కి కోర్టులో చుక్కెదురు

Trump-has-been-shoke-in-newyark-court

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి న్యూయార్క్ కోర్టులో చుక్కెదురైంది. ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘ట్రంప్‌ ఫౌండేషన్‌’కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారంటూ.. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రెండు మిలియన్‌ డాలర్లు స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని ఆదేశించింది. ఆయన 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ ఏజీ కావాలనే తీర్పును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. అయితే స్వచ్ఛంద సంస్థలకు రెండు మిలియన్‌ డాలర్లు ఇవ్వడం సంతోషమేనని ఆయన స్పష్టం చేశారు.

You might also like