FbTelugu

వీసాలపై దిగొచ్చిన ట్రంప్ సర్కారు!

వాషింగ్టన్: వివాదాస్పద వీసాల ఉత్తర్వులపై టెక్ కంపెనీలు తిరుగుబాటు చేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు.
అమెరికాలో ఆన్ లైన్ క్లాసులను ఎంపిక చేసుకున్న విద్యార్థులు స్వదేశాలకు తరలివెళ్లిపోవాలని, భౌతికంగా క్లాసులకు హాజరయ్యేవారు మాత్రమే యూఎస్ లో ఉండాలని ఇటీవల ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ టెక్ కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఒక గ్రూపుగా ఏర్పడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఒత్తిడి పెరగడంతో పునరాలోచనలో పడిన ట్రంప్ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జూలై 6న యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఈ ఆదేశాలను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.

You might also like