FbTelugu

ప్రభుత్వ సహకారాన్ని అడ్డుకోనన్న ట్రంప్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి 20 రోజులు దాటినప్పటికీ.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. అయితే తాజాగా తాను ఓటమి పాలైనట్టు ట్రంప్ అంగీకరించారు.

ట్విట్టర్ వేదికగా.. పలు వ్యాక్యలు చేశారు. బైడెన్ నేతృత్వంలోని ట్రాన్సిషన్ టీమ్ కు ప్రభుత్వ సహకారాన్ని తాను అడ్డుకోబోనని ట్రంప్ తెలిపారు. జనవరి 20 నాటికి అధికార బదలాయింపునకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. ట్రంప్ గత కొన్ని రోజులుగా వాదిస్తూ తన ఓటమిని ఒప్పుకోని విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.