FbTelugu

ఆ రెండు యాప్ లు ఇక కన్పించవు: యూఎస్

వాషింగ్టన్: అమెరికాలో ఆదివారం నుంచి టిక్ టాక్, వీ చాట్ యాప్ లు కన్పించవని, నిషేధించామని కామర్స్ సెక్రెటరీ విల్బర్ రోస్ ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

ఆదివారం నుంచి ఈ రెండు యాప్ లు ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫామ్ లపై డౌన్ లోడ్ చేయడానికి అవకాశం ఉండదు. చైనీస్ కమ్యనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కంపెనీలకు చెందిన యాప్ లను అమెరికా పౌరులు ఉపయోగించడం మూలంగా జాతీయ భద్రతకు ప్రమాద పొంచి ఉందని ప్రకటించారు. అంతే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయనే కారణంగా వీటిని నిషేధించామని రోస్ తెలిపారు.

టిక్ టాక్ షేరింగ్ యాప్ ను తొలుత మైక్రో సాఫ్ట్ కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా చర్చలు విఫలమయ్యాయి. మైక్రోసాఫ్ట్ వెనక్కి తగ్గడంతో ఒరాకిల్ రంగంలో దిగింది. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ తో చర్చలు జరపగా, మైనారిటీ వాటా ఇచ్చేందుకే సుముఖత వ్యక్తం చేసింది. ఈ వివరాలు తెలియడంతో ట్రంప్ ఈ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బైట్ డ్యాన్స్ కు మెజారిటీ వాటా, ఒరాకిల్ కు మైనారిటీ వాటా ఇవ్వడం ఒప్పందం చేసుకోవడం తను వ్యతిరేకిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.