అమరావతి: ఏలూరు బాధితుల రక్తంలో మోతాదుకి మించి లెడ్, నికెల్ ఉందని ఏపీ ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు.
ఏలూరు ఘటనపై పలు వైద్య సంస్థలు అందించిన రిపోర్టులను ఆయన ఇవ్వాళ మీడియా కు వివరించారు. కాగా తాగునీరు కలుషితం కాలేదని రిపోర్టుల్లో తేలిందన్నారు. నీటిపై అపోహ వద్దు.. సురక్షిత నీరు సరఫరా చేస్తున్నామాన్నారు.
రైస్‌లో పాదరసం ఉందని హైదరాబాద్ ఎన్ఐఎన్ తేల్చిందని ఆయన చెప్పారు. వాయు కాలుష్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. రక్త నమూనాలపై హైదరాబాద్ సీసీఎంబీ రిపోర్టు వచ్చిందన్నారు.
ఆహారం, కూరగాయల్లో పెస్టిసైడ్స్ కనిపించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్ట్‌లో సీసం ఉందని తేలిందన్నారు. కొన్ని సంస్థలు పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ స్పష్టం చేశారు