FbTelugu

హామీలిచ్చి మర్చిపోవడమే టీఆర్ఎస్ పని : ఉత్తమ్

హైదరాబాద్: ఎన్నికల ముందు ప్రజలకు భారీగా హామిలిచ్చి ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం టీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని, వారి మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో విసిరేయాలన్నారు. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ఎన్ని అబద్దాలకైనా.. హామీలకైనా వెనుకాడడం లేదని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని.. కొత్తగా మళ్లీ అవే హామీలను ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.