FbTelugu

రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ గెలుపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో గెలుపొందారు.

వీటితో పాటు నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట, జడ్చర్ల, సిద్దిపేట మునిసిపాల్టీలను సైతం కైవసం చేసుకున్నది. గ్రేటర్ వరంగల్ లో 66 స్థానాలకు గాను టిఆర్ఎస్ 51, బిజెపి 10, రెండు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఖమ్మంలో 55 స్థానాలకు గాను టిఆర్ఎస్ 45 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 8 డివిజన్లు, బిజెపి ఒక స్థానం, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. నకిరేకల్ లో 20కి 12, కొత్తూరులో 12కు 7, అచ్చంపేటలో 20కి 13, జడ్చర్ల 27కు 23, సిద్దిపేట 43కు 36 డివిజన్ల చొప్పున టిఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కార్యకర్తలు, నాయకులు సంబురాలు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.