FbTelugu

మధుకాన్ తో నాకు సంబంధమే లేదు: నామా నాగేశ్వర్ రావు

హైదరాబాద్: మధుకాన్ తో పాటు ఇతర కంపెనీల్లో నేను డైరెక్టర్ గా లేనని, మా తమ్ముళ్లు చూస్తున్నారని లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. మొదటి నుంచి రాంచీ ఎక్స్ ప్రెస్ వే కంపెనీలో నేను లేనని ఆయన తెలిపారు.
మధుకాన్ సంస్థను 40 ఏళ్ల క్రితం నేను స్థాపించానని, ఇప్పుడు శాఖోపశాఖలు గా విస్తరించిందన్నారు. ఇవాళ నామా నాగేశ్వర్ రావు తనతో పాటు మధుకాన్ గ్రూప్ కంపెనీల్లో ఈడి దాడులపై ఆయన మీడియాతో మాట్లాడారు. 2011లో రాంచీ ఎక్స్ ప్రెస్ వే 160 కిలోమీటర్ల ప్రాజెక్టు తో మొదలైందని, మొత్తం రూ.1600 కోట్ల ప్రాజెక్టులో రూ.460 కోట్లు కంపెనీ సమకూర్చుకోవాలన్నారు. మిగతా మొత్తం బ్యాంకుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాంకు ప్రాజెక్టు మీద రూ.652కోట్లు మాత్రమే ఇచ్చి, వడ్డీ రూపంలో రూ.378 కోట్లు వసూలు చేసిందన్నారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు రద్దు చేశామన్నారు. బిహార్ లో చెట్లు కొట్టి వేస్తున్నారని 2014లో హైకోర్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారన్నారు. ప్రాజెక్టు రద్దు చేసే సమయానికి 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఎస్క్రో అకౌంట్ పై అధికారం బ్యాంక్ కు మాత్రమే ఉందని, కంపెనీకి లేదన్నారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం మేము పనిచేశామని, జరిగిన అన్యాయంపై ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కు వెళ్లామన్నారు.

ప్రాజెక్టు పై మూడు కాంట్రాక్టు లు ఉన్నాయని, ఇంత వరకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా బిఓటి ప్రాజెక్టు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈడి, సిబిఐ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని నాగేశ్వర్ రావు తెలిపారు.
నా గురించి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసు అని, నేను నీతి నిజాయితీ తో ఉంటానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మా నాయకుడు కెసిఆర్ బాటలో నేను నడుస్తానని, నా బలం కెసిఆర్ అని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కెసిఆర్ వెంటనే నడుస్తానని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ వేధింపులపై ఎంపి నాగేశ్వర్ రావు అసహనం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.