FbTelugu

డ్రగ్స్ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ వ్యాపారస్తులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే సమాచారంతో కలకలం మొదలైంది.
డ్రగ్స్ కేసులో ముగ్గురు వ్యాపారులకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇవ్వగా, సందీప్ రెడ్డి హాజరై కొన్ని వివరాలు అందచేశారు. మిగతా ఇద్దరు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసులో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన కలహర్, సందీప్ రెడ్డి లకు బెంగళూరు లో బార్, పబ్ బిజినెస్ లు ఉన్నాయి. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు తరచూ తమ పబ్బులలో పార్టీలు ఇచ్చేవారని అంటున్నారు. కన్నడ సినీ పరిశ్రమతోనూ వీరికి సత్సంబంధాలు ఉన్నాయి. శంకర్ గౌడ తో కలిసి సిని పరిశ్రమలో వ్యాపారం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే నేరుగా పబ్ నుంచి డ్రగ్స్ తీసుకువెళ్లారనే ఆధారాలు తమకు లభించాయని పోలీసులు చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే పేరును సందీప్ రెడ్డి పోలీసులకు తెలియచేసినట్లు సమాచారం. మిగతా ముగ్గురు ఎవరనేది మాత్రం తనకు తెలియదని సందీప్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.