FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దందా చేస్తున్నారు…

వరంగల్ లో కలకలం రేపుతున్న కరపత్రం
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో ఇరుక్కున్నారు.

టికెట్ కోసం ఎమ్మెల్యేలే డబ్బులు అడుగుతున్నారంటూ కరపత్రాలు బయటకు రావడంతో వరంగల్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల్లో వార్డు మెంబర్ గా పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కరపత్రం విడుదల చేయడం కలకలం రేపుతోంది. పార్టీని నమ్ముకుని మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కాకుండా రౌడీషీటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. డివిజన్లలో సర్వేల పేరుతో టికెట్లను కేటాయిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నా.. వాస్తవానికి అలా జరగడం లేదని కరపత్రాల్లో పేర్కొన్నారు.

సర్వేలు అనేవి నామమాత్రమేనని ఎమ్మెల్యేలే చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి శాఖ మంత్రి కేటీఆర్… గెలిచే అభ్యర్థులకు, పార్టీ కోసం పనిచేసే వారికి, విద్యావంతులకు టికెట్లు దక్కేలా చూడాలని కోరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల డబ్బుల దందాపై ట్విటర్ వేదిక స్పందించాలని కోరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.