FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే యశోదకు, ప్రజలు గాంధీకా?

ఈటలను తొలగించేందుకే ఈ డ్రామా?

జర్నలిస్టులకు కూడా ట్రీట్ మెంట్ చేయడం లేదు

సీఎం కేసీఆర్ పై భగ్గుమన్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజటివ్ వస్తే యశోదా ఆసుపత్రికి, ఇదే న్యాయం ప్రజలకు, జర్నలిస్టులకు ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరుగుతున్న జర్నలిస్టుల ఒకరోజు ఉపవాస దీక్షకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా వస్తే యశోద ఆసుపత్రి లో వైద్యం అందిస్తున్నారు. అంటే ప్రభుత్వం గాంధీ ఆసుపత్రి లో సౌకర్యాలు లేవని చెప్పకనే చూపుతుందన్నారు. తెలిసి తెలిసి  పేదవారి ప్రాణాలను మాత్రం గాంధీ లో ఫణంగా పెడుతుందని ఆరోపించారు.

రాష్ట్రంలో మిగతా విషయాలు దేవుడెరుగు… చివరికి పేద ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వా న్ని ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను, జర్నలిస్ట్ ల గొంతులను నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. ఆఖరికి మీరు కూడా ఉపవాస దీక్ష చేస్తున్నారు అంటే.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది స్పష్టమవుతుందన్నారు. విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారన్నారు. ప్రభ్యత్వం ఇప్పటికైనా  ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మృతి చెందిన టీవీ5 విలేకరి మనోజ్ యాదవ్ కి ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లో ఇప్పటి వరకు 50 వేల టెస్టులు చేయలేదు.. అంటే ప్రభుత్వం కరోనాపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందన్నారు. జర్నలిస్టుల సహాయ నిధికి రూ.2లక్షల చెక్ ను రేవంత్ రెడ్డి అందజేశారు.

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి. సింధు కు కోట్ల రూపాయలు నజరానాలు ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కరోనా విరాళాల ద్వారా సీఎం కేసీఆర్ కు రూ.10నుండి 15వేల కోట్ల నిధులు వచ్చాయన్నారు. అయినా కరోనా బాధితులకు సరైన చికిత్స అందించకపోవడం విచారకరం అన్నారు. న్యాయవాదులకు రూ.25కోట్ల సహాయం అందించినట్లే జర్నలిస్ట్ లకు  కూడా సహాయం అందించాలన్నారు.

వారం రోజుల్లో ఈటల ఇంటికే…

వచ్చే వారం ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నారు.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిస్థితిని తీసుకువచ్చారన్నారు. కరోనా నియంత్రణ విషయంలో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఈటలను మంత్రి పదవి నుండి తొలగిస్తారని టీఆర్ఎస్ నాయకుడు తనతో చెప్పాడని రేవంత్ తెలిపారు.

TUWJ Leaders Protset

You might also like