FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి

హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుదిశ్వాస విడిచారు. తన కాలుకు రక్త ప్రసరణలో చిన్న ఇబ్బంది ఏర్పడడంతో దాదాపు 20 రోజుల క్రితం కొంపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

అది వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వారం రోజుల క్రితం గచ్చిబోలిలోని ఏ.ఐ.జీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడుతున్న రామలింగారెడ్డి రాత్రి 2.30గం.ల ప్రాంతంలో తుది శ్వాస వదిలారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

You might also like