FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చీఫ్ ట్రిక్స్

జనగామ: ఒక మురికి కాల్వ విషయంలో మాజీ సర్పంచిపై అలిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేలపై పడుకుని నిరసన తెలిపారు. మాజీ సర్పంచి హామీ ఇస్తే తప్ప నేల పై నుంచి లేవనని భీష్మించుకున్నారు.

మాజీ సర్పంచి సహకరిస్తానని చెప్పడంతో ఆయన లేచి నిలబడ్డారు. ఈ ఘటనకు  సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ మున్సిపాల్టీ నుంచి యశ్వంతాపూర్ వాగులోని మళ్లించే మురికి కాల్వ విషయంలో గ్రామ మాజీ సర్పంచి సుశీల కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. గతంలో స్టే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి పలుమార్లు ఆమెను కోరినా విన్పించుకోలేదు. ఇవాళ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ఆయన కు మాజీ సర్పంచి ఎదురు కావడంతో నిరసన వ్యక్తం చేశారు.

వెంటనే ఆయన అక్కడే నేలపై పడుకున్నారు. స్టే ఉత్తర్వులను రద్దు చేస్తే తప్ప లెగిసేది లేదని, పడుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాజీ సర్పంచి సుశీల హామీ ఇవ్వడంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై యశ్వంతాపూర్ గ్రామస్థులు మండిపడుతున్నారు. బతుకమ్మ కుంట నుంచి వరదనీరు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బతుకమ్మ కుంట కింద ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందని, దాని కోసమే ఈ డ్రామాలు అని గ్రామస్థులు భగ్గుమన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.