FbTelugu

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్ఎస్ భేటీ

హైదరాబాద్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇవాళ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్‌ బేటీ అయ్యారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్థానంపై పార్టీలోని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్‌ అనూహ్యంగా పీవీ కుమార్తెను తెరపైకి తీసుకురావడం పట్ల రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.