FbTelugu

టీఆర్ఎస్ నేత ఇంట్లో బాలికపై అత్యాచారం?

జగిత్యాల: రాయికల్ మండల కేంద్రానికి చెందిన ఓ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఇంట్లో పనిచేస్తున్న బాలిక(17) గర్భం దాల్చడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

బాలిక గర్భం దాల్చిన విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అయితే బాలికను రెస్క్యూ హోం కు తరలించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. టిఆర్ఎస్ నాయకుడి ఇంటి పక్కనే బాలిక కుటుంబం ఉంటున్నది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది ఆమె తర్వాత చెల్లెలు పని చేస్తోంది. పార్టీ నాయకుడిగా ఉండి బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే గాక ప్రస్తుతం గర్భం దాల్చడం కలకలంగా మారింది. డిసిపిఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని కనిపెట్టే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడితో పాటు అదే ఇంట్లో ఉంటున్న డ్రైవర్ పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వివరాలను బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల ఆధీనంలో ఉన్న బాలికను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. బాలిక గర్భం దాల్చిన విషయమై డీఎస్పి వెంకట రమణను మీడియా వివరణ కోరగా, ఇది సున్నితమైన కేసు అని అన్నారు. ఇప్పుడే వివరాలు బయటకు చెప్పలేమన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.