FbTelugu

నన్నే ఆపుతారా? టీఆర్ఎస్ నేత దౌర్జన్యం!

పెద్దపల్లి: కరోనా మహమ్మారి నియంత్రించందేకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రోడ్లపై జనం కన్పించడంతో మరింత కఠినంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

కెసిఆర్ ఆదేశాల మేరకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ ఎలా అమలవుతుందో తెలుసుకునేందుకు హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. డిజిపి పర్యటిస్తుండడంతో కమిషనర్లు, జిల్లా ఎస్పిలు రోడ్లకు మీదకు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి పోలీసు చెక్ పోస్టు వద్ద టీఆర్ఎస్ నాయకుడు వీరంగం చేశాడు. పెద్దపల్లి నుంచి వస్తున్న కారును పోలీసులు ఆపి వివరాలు అడిగారు. ఆయనకు కోపం వచ్చింది. నేను పెళ్లికి వెళ్తున్నాను, ఎవరనుకుంటున్నారు నన్ను, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తమ్ముడిని అంటూ దబాయించాడు. మేమిచ్చే డబ్బులకు ఆశపడి డ్యూటీ చేస్తూ, మేమంటే మీకు లెక్కలేదా అని వీరంగం చేశాడు. ఈయన చిందులను గమనించిన కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియలో షేర్ చేశారు. ఇంకేముంది వైరల్ అయ్యింది. చిందులు వేసిన వ్యక్తి పేరు దాసరి అంజిరెడ్డి అని, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సోదరుడు అవుతారని అక్కడున్నవారు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.