FbTelugu

రూ.32 లక్షలు ఖర్చు… దక్కని టిఆర్ఎస్ నేత ప్రాణం

వరంగల్: గీసుకొండ మండలం కీర్తినగర్ కాలనీకి చెందిన ఎడెల్లి పుల్లారెడ్డి కరోనా చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. నెల రోజుల పాటు హాస్పిటల్ లో పోరాడుతూ చివరకు చనిపోయారు.
కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఎడెల్లి పుల్లారెడ్డి (530 స్థానికంగా టిఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. నెల రోజుల క్రితం పుల్లారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ సోకింది.

వ్యాధి నయం కాకపోవడంతో వరంగల్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటికే రూ.4 ఖర్చు అయినా తగ్గుముఖం పట్టకపోవడంతో అక్కడి నుంచి కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ 25 రోజుల పాటు చికిత్స తీసుకోగా రూ.25 లక్షలు ఖర్చు అయ్యింది. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రెండు రోజుల క్రితం తరలించగా, రూ.3 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం చనిపోయారు. రూ.32 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కకపోవడంతో పుల్లారెడ్డి భార్య కన్నీరుమున్నీరు అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.