FbTelugu

గులాబి చేతికి నాగార్జున సాగర్

నాగార్జున సాగర్: ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి పై విజయబావుటా ఎగుర వేశాడు.

నోముల భగత్ చివరి రౌండ్ లో 18,788 ఓట్ల ఆధిక్యం పొంది సిట్టింగ్ స్థానం కైవసం చేసుకున్నాడు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2.20 లక్షల ఓటర్లు ఉన్నారు. కాగా ఇందులో 1.89 లక్షల ఓట్లు పోలయ్యాయి. 25వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు 2443 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. దీంతో 25వ రౌండులో టీఆర్ఎస్ 35 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ 18,788 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.