FbTelugu

టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సక్రమంగా ఉన్న ఫారమ్ ను మంగళవారం నాడు దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారి సూచించారు.

ఆదివారం సాయంత్రం మాజీ ప్రధాని పీవి కుమార్తె సురభి వాణీదేవీని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె ఇవాళ ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లి బీ ఫారం ను తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం తో అట్టహాసంగా గ్రూపు ఫొటో దిగారు. ఆ తరువాత గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ది నివాళులు అర్పించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వెళ్లారు. నామినేషన్ పత్రాలు సమర్పించి, ప్రమాణం కూడా చేశారు. పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు సరిగా లేవని, తప్పుల తడకగా ఉన్నాయంటూ తిరస్కరించారు. మంగళవారం నాడు మరోసారి నామినేషన్ పత్రాలను సమర్పించాల్సిందిగా సూచించడం తో వెనుతిరిగిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.