FbTelugu

టిఆర్ఎస్ అభ్యర్థి భగత్

హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుమారుడు భగత్ కు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇవాళ తెలంగాణ భవన్ లో సిఎం కెసిఆర్ నోముల భగత్ కు బి ఫారమ్ అందచేశారు.

సిఎం కెసిఆర్ మధ్యాహ్నం తెలంగాణ భవన్ చేరుకున్నారు. సిఎం రాకకు ముందే నోముల భగత్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున నోముల భగత్ మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉండడంతో చివరకు భగత్ వైపే కెసిఆర్ మొగ్గు చూపారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అభ్యర్థిని గట్టెక్కిస్తాయనే ధీమాతో సిఎం ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటర్లు పట్టం కట్టడంతో సాగర్ నియోజకవర్గంలో గెలుస్తామనే ధీమా శ్రేణుల్లో పెరిగింది. గత రెండు వారాలుగా టిఆర్ఎస్ నాయకులు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎవరిని బరిలోకి దించినా గెలిపిస్తామని నియోజకవర్గ నాయకులు కూడా పార్టీ అధిష్టానానికి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.