FbTelugu

టికెట్ కోసం ఇళ్లెక్కిన టిఆర్ఎస్ కార్యకర్త

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసేందుకు పలువురు టిఆర్ఎస్ ఆశావహులు పోటీపడుతున్నారు. 58వ డివిజన్ తనకే కేటాయించాలంటూ శోభారాణి భవనం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు.
తనకే టికెట్ ఇవ్వాలని, లేదంటే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు భవనం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆమెకు నచ్చచెప్పి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు బి ఫారం ఇవ్వాలని, అప్పుడే కిందకు దిగుతానని స్పష్టం చేయడంతో టిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. బుధవారం నాడు దర్శన్ సింగ్ అనే కార్యకర్త కూడా కార్పొరేటర్ టికెట్ కోసం సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.