FbTelugu

నీ కాళ్లు మొక్కుతా… ప్రాణబిక్ష పెట్టు అన్నా..!

చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ను వేడుకున్న టిఆర్ఎస్ కార్యకర్త
వరంగల్: వినయ్ అన్నా నీ కాళ్లు మొక్కుతా… ఇక నా వల్ల అయితలేదు అన్నా.. ఈ ఒక్కసారి నన్ను బతికించు అన్నా అని ఒక టిఆర్ఎస్ కార్యకర్త పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్ కార్పొరేషన్‍ ఎన్నికల సందర్భంగా అడ్డగట్ల ఆంజనేయులు టీఆర్ఎంస్‍ ప్రచారంలో పాల్గొన్నాడు. ఆంజనేయులుకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం, నాయకులు పట్టించుకోకపోవడంతో తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కాడు. ఆంజనేయులు ఏడుస్తూ శనివారం రాత్రి సోషల్‍ మీడియాలో పెట్టిన పోస్ట్ టిఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్భాలస్కర్‍ సూచన మేరకు ప్రచారంలో పాల్గొన్నానని అన్నాడు. కరోనా పాజిటివ్ వచ్చాక ఏ ఒక్కరూ తనను పట్టించుకోవడంలేదని వీడియోలో ఆవేదన చెందారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, టిఆర్ఎస్ నాయకుడు విద్యాసాగర్ పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. వినయన్నా.. మొన్నటి వరంగల్‍ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్‍ టిఆర్ఎసస్‍ అభ్యర్థి తరఫున ఇంటింటికి తిరిగి ప్రచారం చేశానన్నా.. నాకు ఈ గతొచ్చిందన్నా.. ఎవరి కోసం తిరిగానో ఆ విద్యాసాగర్‍ వస్తనేలేడు.. నా ప్రాణం ఉంటదో పోతదో అర్థం కావట్లేదు.. ఎంజీఎంలో ఒక వెంటిలేటర్‍ ఇప్పియ్యండి.. మీ కాళ్లు మొక్కుతా అని కన్నీళ్లతో వేడుకున్నాడు. నా భార్య పిల్లలు ఆగమైతాళ్లు.. పదిరోజుల బట్టి చస్తున్నా.. అవి ఇవి అమ్మి హాస్పిటల్లో రూ.2.5 లక్షలు కట్టినాను అన్నా. ఇప్పుడు నా దగ్గర పైసలు కట్టే స్తోమత లేదు.. దీంతో హాస్పిటల్ వాళ్లు ట్రీట్మెం్ట్‍ ఆపేసిన్రు.. అన్నా వినయన్నా.. వెంటిలేటర్‍ ఇప్పియ్యండన్నా అని ఆంజనేయులు ప్రాధేయపడ్డాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.